ప్రస్తుతం సాయి పల్లవితో 'లవ్ స్టోరీ' చేస్తున్న నాగ చైతన్య.. తన తదుపరి సినిమాను 'మనం' ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న చైతూ.. తన తదుపరి సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఈ క్రమంలోనే విక్రమ్ కుమార్‌తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ విషయమై దర్శకనిర్మాతలకు నాగ చైతన్య ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కథా కథనాల విషయంలో చర్చలు జరిపి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు డైరెక్టర్ విక్రమ్ కుమార్. చిత్రానికి 'థాంక్యూ' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. ఇక ఈ మూవీలో ముందుగా నాగ చైతన్య సరసన సమంతను తీసుకోవాలని భావించారు. కానీ ఆ తర్వాత కొన్నిరోజులకు అనూహ్యంగా ఆమె కాదు.. కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయిందనే టాక్ బయటకొచ్చింది.
కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం కీర్తి సురేష్ కూడా కాదు.. రష్మిక ఫైనల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగవుతున్న రష్మికను నాగ చైతన్యనే స్వయంగా రెకమండ్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. చైతూ కోరిక మేరకు చిత్రయూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతోందట. రెమ్యునరేషన్ విషయంలో కూడా వెనక్కితగ్గకుండా ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. సో.. చూడాలి మరి సమంత స్థానంలో అక్కినేని వారబ్బాయితో రొమాన్స్ చేయడానికి రష్మిక సై అంటుందా? లేదా? అనేది.

0 Comments