వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన మరో వ్యక్తి లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అది సినిమా అయినా, ఇంటర్వ్యూ అయినా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ తన అభిప్రాయం బయటపెట్టేయడం ఒక్క వర్మకే చెల్లుతుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతం నేపథ్యంలో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన వర్మ ట్విట్టర్ వేదికగా షాకింగ్ రిప్లై ఇచ్చారు. ''నా మర్డర్ సినిమాపై కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి చెబుతున్నా. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప వాస్తవం కాదు. అదేవిధంగా ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు'' అని తెలిపారు.
అమృత, ప్రణయ్, మారుతీ రావుల విషాదగాదపై కన్నేసిన వర్మ.. ఆ కథ ఆధారంగా 'మర్డర్' పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించి కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్‌తో ప్రేక్షకుల ముందుంచనున్నట్లు చెప్పారు. అయితే ఆదిలోనే ఈ మూవీపై వ్యతిరేకత చోటుచేసుకుంది. మర్డర్ సినిమా కోసం ప్రణయ్, అమృత, మారుతీరావు ఫొటోలను వాడారని పేర్కొంటూ ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు.With regard to media speculations on the case filed on my film MURDER ,I once again want to reiterate that my film is based and inspired from a true incident and it is not the truth ..Also there’s no mention of anyone’s caste in the film pic.twitter.com/apiT6rKJDn— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020
దీంతో కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన వర్మ ట్విట్టర్ వేదికగా షాకింగ్ రిప్లై ఇచ్చారు. ''నా మర్డర్ సినిమాపై కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి చెబుతున్నా. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప వాస్తవం కాదు. అదేవిధంగా ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు'' అని తెలిపారు.
ఆ వెంటనే మరో ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ''ఈ మూవీ గురించి తెలుసుకోకుండా కేసు ఫైల్ చేశారు. అయితే ఆ కేసు విషయమై మా న్యాయవాదులు న్యాయ ప్రకారం తగిన సమాధానం ఇస్తారు'' అని పేర్కొన్నారు. అంతేకాదు మర్డర్ నుంచి మరో కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు వర్మ.With regard to the case filed on the basis of uninformed speculations,our advocates will give an appropriate reply as required by law pic.twitter.com/Fa6qQbFh84— Ram Gopal Varma (@RGVzoomin) July 5, 2020
0 Comments