
నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. పెద్దపెద్ద దర్శకులు, హీరోయిన్లతో పనిచేస్తోన్న ఈ బెల్లంకొండవారి అబ్బాయికి ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ ఏడాది ‘సీత’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి శ్రీనివాస్ నిరాశపరిచారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితే, ఇప్పుడు ‘రాక్షసుడు’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్‌తో శ్రీనివాస్ ప్రేమక్షకుల ముందుకు వచ్చారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగులు రాశారు. ఎ స్టూడియోస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేసింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ‘రాక్షసుడు’ ఈ శుక్రవారం (ఆగస్టు 2న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో కన్నా ముందుగానే యూఎస్‌లో ప్రీమియర్ షోలో ప్రదర్శించారు. అక్కడ సినిమాను చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
‘రాక్షసుడు’ సినిమా చాలా బాగుందని అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు కొనియాడుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకట్టుకున్నాడట. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్‌ప్లే అని చెబుతున్నారు. రేసీ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని అందించారట. తరవాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ సినిమాను ఇప్పటికే తమిళంలో చూసేసిన వారికి పెద్దగా థ్రిల్ అనిపించదట. ఎందుకంటే, సెకండాఫ్‌ను అస్సలు మార్చలేదట. ఒరిజినల్ ఎలా ఉందో అలానే దించేశారని చెబుతున్నారు.
#Rakshasudu Movie Review - Engaging Thriller@BSaiSreenivas is impressive , Racy Screenplay , Excellent Bgm , Plot , Interval block— Weekend Review (@cinema_radar) August 1, 2019
Predictable flashback , No Changes From Original#Rakshasudu is highly engaging thriller
Must watch if you didn't watch Original - 3.5/5 pic.twitter.com/lAU9PwjKlv
#Rakshasudu— #SarileruNeekevvaru (@Sariler87793225) August 1, 2019
Premier Shows Update #Rakshasudu Esaare Content Tho Gattiga Kodthunadu @BSaiSreenivas @anupamahere
Same as The Original With Second Half🔥🔥🔥🤙 Advance Congratulations To One of Fan Of #MaheshBabu #SuperstarMaheshBDayMonth pic.twitter.com/wg37L35HsZ
#Rakshasudu - (3.25/5) Engaging Psycho Thriller— KARTHIK (@HeIsKARTHIK) August 2, 2019
Everything you see by frame to frame, whether the 1st half or else 2nd half says a word TERRIFIC. Tight packed Screenplay with BGM holds the nerve.
All in all, the movie is a sureshot Commercial hit for Bellamkonda.
Must Watch..! pic.twitter.com/GwRTNuiC4j
జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సినిమాకు మరో బలం అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా సినిమా అయితే చాలా బాగుందని, ఎంగేజింగ్ థ్రిల్లర్ అని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్‌కు చాలా రోజుల తరవాత ఒక హిట్ వచ్చినట్టే. 2017లో వచ్చిన ‘జయ జానకి నాయక’ తరవాత బెల్లంకొండ మళ్లీ హిట్ కొట్టలేదు. అయితే, ‘రాక్షసుడు’తో శ్రీనివాస్‌కు బ్రేక్ వస్తుందని అంటున్నారు. మరి ప్రస్తుతం శ్రీనివాస్‌కు ఉన్న క్రేజ్, మార్కెట్‌తో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి!
0 Comments