
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. మూడురోజుల తర్వాత బాలుడు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు, మీడియాతో సాయంతో తమ బిడ్డకు క్షేమంగా తిరిగొచ్చాడని బాలుడి తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కథ సుఖాంతం అయినప్పటికీ జషిత్‌ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు ఎత్తుకెళ్లారు? వాళ్ల లక్ష్యమేంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
0 Comments