Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

గ్రామ వాలంటరీ పోస్టుల భర్తీ ప్రక్రియపై హైకోర్టులో పిల్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 4 లక్షల గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీచేపట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అయితే, వాలంటీర్‌ పోస్టులను ఇంటర్వ్యూ ప్రాతిపదికన భర్తీచేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని అభ్యర్థిస్తూ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాకేశ్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేవలం మౌఖిక పరీక్ష ద్వారా వీటిని భర్తీ చేయడం తగదని, విద్యార్హత ఆధారంగా వెయిటేజ్‌ మార్కులు ఇవ్వాలని పిల్ పేర్కొన్నారు. అంతేకాదు, నియామకాలకు సంబంధించిన జీవో లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. వాలంటరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీచేసిన జీవో 104 అమలును నిలుపుదల చేయాలని రాకేశ్ రెడ్డి తన వ్యాజ్యంలో కోరారు. 

Post a Comment

0 Comments